హర్రర్ అంశాలతో కూడిన కుటుంబ కథ చిత్రంగా, భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా అనేది ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘తంతిరం’. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో నవతరం నటీనటులతో తీసిన ఈ సినిమాని సినిమా బండి బ్యానర్ పె శ్రీకాంత్ కంద్రగుల నిర్మించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సందర్బంగా డైరెక్టర్ మాట్లాడుతూ,’థియేటర్లలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే సినిమా ఇది’ అని చెప్పారు. ‘నా లైఫ్‌లో ఇది చాలా పెద్ద మూవీ అవుతుంది. మిమ్మలి ఈ సినిమా కచ్చితంగా భయపెడుతుంది’ అని నాయిక ప్రియాంక శర్మ అన్నారు. హీరో శ్రీకాంత్ గుర్రం మాట్లాడుతూ,’ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది’ అని తెలిపారు. నిర్మాత శ్రీకాంత్ కంద్రగుల మాట్లాడుతూ,’సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. హీరో శ్రీకాంత్ పేరు అందరికి వినిపించే పేరు అవుతుంది. నేను చాలా సినిమాలను ఓవర్సీస్ రిలీజ్ చేశాను. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ. ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.