ఆత్మబంధు ద్వారా అన్నదానం…!

నవతెలంగాణ -పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ సేవాతత్పరుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డిఅడిగితే లేదనకుండా ప్రతి ఒక్క నిరుపేదకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం తరి పెద్ద యల్లమ్మ పెద్దవూర మండలం పోతునూరు, కుంటిగొర్ల దుర్గమ్మ అనుముల మండలం
హాజారిగూడెం,సలికంటి పాపయ్య నిడమనూరు మండలం ముకుందాపురం,బుర్రిపాటి ముత్తమ్మ నిడమనూరు మండలం పార్వతిపురం,గోగుల రమణమ్మ నిడమనూరు మండల కేంద్రము,పేరూరు కోటయ్య అనుముల మండలం ఇబ్రహీంపేట, పాతనబోయిన చెన్నమ్మ అనుముల మండలం
హాలియ మున్సిపాలిటీ, ముసుగు లక్ష్మమ్మ గుర్రంపోడు మండలం కోయగూరోని బావి,వాగ్దావత్ నందా నాయక్ త్రిపురారం మండలం దుబ్బ తండా, జింకల ముత్యాలు గుర్రంపోడు మండలం ఎల్మోన్ గూడెం,యస్.కె ఫర్దాన్ త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు  అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి ఆత్మబంధు  కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు పంపించారు.సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించాలని కోరారు. నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో  ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగింని పాండు రంగారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ పాల్గొన్నారు.