స్మశాన వాటికను కూలగొట్టిన దుండగులు?

– ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన
– దుండగులపై చర్యలు తీసుకోవాలి స్థానిక ప్రజలు
నవతెలంగాణ – ఓదెల
ఓదెల మండలం గుంపుల గ్రామంలో వైకుంఠం ధామం ను జెసీబీ తో కూలగోట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రికి రాత్రే గుర్తుతెలియని వ్యక్తులు జెసిబి తో కూలగొట్టినట్లు ఆనవాళ్లు కనబడుతున్నట్లు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాన్ని సామాన్య ప్రజలకు  ఉపయోగకరంగా ఉండేవిధంగా సుమారు 12 నుంచి 13 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం ను జెసిబి తో కూలగోట్టడం అమానుషమంటున్నారు. అంతేకాక సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న వైకుంఠధామం ను కూల్చడం ద్వారా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ప్రజాధనాన్ని వెచ్చించి కట్టిన వైకుంఠధామమున కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నించడమే కాక మండిపడుతున్నారు. అధికారులు దీనిపై స్పందించి దుండగులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.