ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన దుండగులు 

నవతెలంగాణ – శంకరపట్నం
ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు  దొంగిలించిన సంఘటన వివరాల ప్రకారం శంకరపట్నం మండల పరిధిలోని ఎరడపల్లి గ్రామానికి చెందిన దుస్స నాగరాజు గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో మెడికల్ షాప్ పెట్టకొని జీవిస్తున్నాడు. శనివారం రాత్రి 10 గంటల కు ఇంటి ముందు ద్విచక్ర వాహనం ఏపీ 15 ఏఆర్ 0472 గల టీవీఎస్ స్పోర్ట్స్ బైకును పెట్టి  తెల్లవారి 5 గంటలకు లేచి చూసేసరికి నా యొక్క బండి కనబడుటలేదని ఆదివారం కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు, నాగరాజు తెలిపారు.