నవతెలంగాణ-సుల్తానాబాద్ : కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులకు ఆ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ గుర్తింపు కార్డులతో పాటు ప్రమాద బీమా కార్డులు అందించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూసుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముకుంటూ చిరు వ్యాపారం చేసుకుంటున్న వారికి ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశం కొద్దిగా ఈ యొక్క ఊరు పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు కూరల మార్కెట్ కు రిజిస్ట్రేషన్ లేకపోవడంతో గత మూడు నెలల కిందట కూరగాయల మార్కెట్ కు రిజిస్ట్రేషన్ చేయించి మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న వారికి ఈరోజు ఐడి కార్డ్స్ మరియు ప్రమాద బీమా కార్డ్స్ అందించడం జరిగిందని కూరగాయల వ్యాపారం అనేది కూడా ఒక గౌరవప్రదమైన వ్యాపారమైననని ఉదయం 3 గంటలకు వచ్చి సాయంత్రం ఏడు గంటల వరకు అహర్నిశలు కూర్చొని అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వారు రానున్న రోజుల్లో వీరికి అన్ని విధాల యొక్క అసోసియేషన్ అండగా ఉంటుందని అలాగే వీరికి ప్రమాదవశాత్తు ఏదైనా జరగరాని జరుగుతే 5 లక్షల బీమా సదుపాయం కలిగే విధంగా మరియు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్న 60% రాయితీతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేపించే విధంగా కార్డ్స్ అందించడం జరుగుతుందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ అధ్యక్షులు దేశెట్టి రవీందర్ ప్రధాన కార్యదర్శి కామ సంపత్.ముఖ్య సలహాదారులు గరిగే విశ్వనాధ్.కోశాధికారి వైద్య లక్ష్మణ్ .ఉపాధ్యక్షురాలు అమ్ముల మంగమ్మ .సభ్యులు తోట సరూప.తోట జ్యోతి .దేవుల నవలోక .సదయ్య.తదితరులు పాల్గొన్నారు