శుభాకాంక్షలు తెలుపుతున్న తుమ్మేటి సుమిరెడ్డి

– మహేష్ ,వెంకట్ లకు ఎమ్మెల్సీ ఇవ్వడం హర్షనీయం
– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి
నవతెలంగాణ – జమ్మికుంట
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఎమ్మెల్సీ పదవులు మహేష్ కుమార్ గౌడ్ , బల్మూరు వెంకట్ లకు ఇవ్వడం హర్షనీయమని జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాదులో ఎమ్మెల్సీ నామినేషన్ వేస్తున్న వారిరువురిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో ఘనంగా సన్మానించారు. ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉండి విద్యార్థుల సమస్యలపై పోరాడినందుకుగాను బలుమూరు వెంకట్ కు సరైన గౌరవం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ తో 34 సంవత్సరాల సంబంధం ఉందని ,కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన మహేష్ గౌడ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం గర్వించదగ్గ విషయమని ఆయన తెలిపారు .రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.