కొత్త బ్రాండ్ ఫిల్మ్ ను విడుదల చేసిన టిక్ టాక్: “టిక్ టాక్ ఫ్రెష్, వైబ్ రిఫ్రెష్”..

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్ : తమ పునరుత్తేజం కలిగించే మింట్ మరియు నోరూరించే రుచులకు పేరు పొందిన, ఫెరేరో గ్రూప్ లో భాగంగా ఉన్న దిగ్గజ బ్రాండ్ టిక్ టాక్, ‘టిక్ టాక్ ఫ్రెష్, వైబ్ రిఫ్రెష్’ నినాదంతో తమ సరికొత్త బ్రాండ్ ఫిల్మ్ ను విడుదల చేసింది. రోజూవార జీవితంలో ఉండే విసుగు మరియు గందరగోళం నుండి తప్పించుకోవాలని కోరుకోవడం ప్రపంచవ్యాప్తంగా సమస్యగా నిలిచింది మరియు ఇదే విషయం గురించి ఈ  కొత్త ఫిల్మ్ సందేశాన్ని అందిస్తోంది.  రోజూవారీ ఒత్తిడి, ట్రాఫిక్ జామ్స్, లేదా నగర జీవితంలో ఉండే అంతులేని శబ్ద కాలుష్యాలతో తరచుగా ప్రజలు కొంచెంసేపు మనశ్సాంతి మరియు పునరుత్తేజం పొందాలని కోరుకుంటారు. ఈ కొత్త బ్రాండ్ ఫిల్మ్ హాస్యం, ఉల్లాసం, పునరుత్తేజం కలిగించే దృశ్యాలు ద్వారా ప్రజలు కోరుకునే ఆందోళనరహితమైన జీవితాన్ని చూపిస్తుంది, ఇది టిక్ టాక్ యొక్క పునరుత్తేజం కలిగించే సానుకూలమైన భావాలతో సరిగ్గా అనుసంధానం చెందింది. బ్రాండ్ ఫిల్మ్ అందరికీ తెలిసిన, రోజూవారీ దృశ్యంతో ఆరంభమైంది: శబ్దాలతో కూడిన ట్రాఫిక్ జామ్. కారులో, ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న గందరగోళంతో విసిగిపోయారు. అతను టిక్ టాక్ ప్యాక్ బయటకు తీసాడు మరియు బాక్స్ ను చిన్నగా తట్టాడు, నోట్లో మింట్ చప్పరించాడు, అంతే, ఏదో అద్భుతం జరిగినట్లుగా అతను ప్రస్తుతం ఉన్న ఒత్తిడితో కూడిన పరిసరాల నుండి ప్రశాంతమైన, శాంతియుతమైన, పచ్చని పచ్చిక బయళ్ల వద్ద ఏనుగు ఉన్న పరిసరాలలోకి మారిపోయాడు. తాజా గాలి, ప్రశాంతమైన జలపాతం, గందరగోళం లేని పరిసరాలు, ప్రకృతి నుండి వస్తున్న ఆహ్లాదకరమైన శబ్దాలు తాజాదనం యొక్క అనుభూతిని తెచ్చాయి. ఊహాత్మకమైన ప్రపంచంలో అతని ఆనందాన్ని టౌకాన్ పక్షి అంతరాయం కలిగిస్తుంది కానీ అదే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న మరొక బైకర్ టిక్ టాక్  అడుగుతున్నాడని అతను తెలుసుకున్నాడు. బైకర్ అప్పుడు వేరొక టిక్ టాక్ చప్పరించాడు & తాజాదనపు ప్రపంచంలో అతనితో చేరి తాజా ఉత్సాహాన్ని ఆస్వాదిస్తూ, కలిసి పంచుకున్న ఆనందాన్ని గ్రహించాడు. శ్రీ. జోహర్ కపుస్వాల, మార్కెటింగ్ హెడ్, పిల్స్ & గమ్స్, ఫెరేరో ఇండియా ఇలా అన్నారు, “జీవితం అనేది గమ్యస్థానం కాదు, అది ప్రయాణాన్ని ఆనందించడానికి సంబంధించినది. మీ భావాలకు తాజాదనం కలిగించి & అదే పరిస్థితిని అనుకూలమైన, తాజా విధానంలో అనుభూతి చెందే ఆ ఉల్లాసాన్ని టిక్ టాక్ మీకు ఇస్తుంది. టిక్ టాక్ పిల్ యొక్క రుచి ఏ విధంగా మీ భావాన్ని పూర్తిగా మార్చివేస్తుందో కొత్త కాంపైన్ చూపిస్తుంది. తాజాదనం కోసం రోజూవారీ గందరగోళం నుండి తప్పించుకోవాలని తీవ్రమైన కోరికను టిక్ టాక్ ఫిల్మ్ తెలియచేస్తుంది మరియు సహజమైన భావాలతో విసుగును అధిగమించడానికి మనస్సును సిద్ధం చేస్తుంది. బ్రాండ్ ఫిల్మ్ సామాజిక & డిజిటల్ ప్లాట్ ఫాంలలో ప్రసిద్ధి చెందిన ప్రాంతీయ భాషలలో (హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం & బెంగాలీ) )#TicTacVibe#VibeRefresh  #FreshVibes ప్రదర్శించబడుతుంది.