ఉదయం 11 దాటినా.. విద్యార్థులకు అందని టిఫిన్..

– కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు తప్పని తిప్పలు..

– కేజీబీవ పాఠశాలలో ప్రతివారం అంతే సంగతి..
– ప్రతి ఆదివారం 3 గంటల తరవాతే మధ్యాహ్న భోజనం..
– ప్రిన్సిపల్ చెప్పినా మారని వంట మనుషుల తీరు..
– ఇబ్బంది పడుతున్న కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ విద్యార్థినిలు సమయానికి భోజనం దొరక అల్లాడిపోతున్నారు. గ్రామాలలో చదవడానికి సరైన వసతులు లేని పేద విద్యార్థులు చదువుకోవడానికి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యార్థినిల పాఠశాలలతో పాటు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం రోజు ఉదయం 11 గంటలు దాటిన విద్యార్థినిలకు టిఫిన్ పెట్టకపోవడంతో ఆ నోట ఈ నోట విషయం బయటకు పొక్కింది. ఆదివారం రోజు 11 దాటిన టిఫిన్ పెట్టకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు కస్తూర్బా గాంధీ పాఠశాల చేరుకుని విద్యార్థులతో విషయం అడగా ప్రతి ఆదివారం ఉదయం 11గంటల తర్వాతే  పెడుతున్నట్లు పేర్కొన్నారు అదేవిధంగా ఆదివారం రోజు మధ్యాహ్న భోజనం మూడు తర్వాతే పెడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రతిరోజు వంట మనుషులు వంట వండిన తర్వాత విద్యార్థులకు భోజనం పెట్టే సమయంలో విద్యార్థులకు సరిపడు కరివేయడం లేదని విద్యార్థులు చెప్పడం జరిగింది ఒకేసారి ఒకే స్పూన్ తో కర్రీ వేసిన తర్వాత తిరిగి మళ్ళీ కరి కావాలంటే లేదు అయిపోయింది అనే సమాధానాలు వంట మనుషులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. మాడిపోయిన చపాతీలు ఇస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. తమకు సరిగ్గా భోజనం పెట్టడం లేదని ఎవరికి చెప్పుకోవాలి తెలియక విద్యార్థినిలు వారిలో వారే బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 6:30 కు వచ్చి విద్యార్థినులకు అల్పాహారం అందించే వంట మనుషులు ఆలస్యంగా వచ్చి తమకు వంట ఆలస్యంగా చేసి పెడుతున్నారని విద్యార్థినిలు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల వరకు విధులు నిర్వహించే ఉపాధ్యాయురాలు విద్యార్థులు తినకముందే వెళ్లిపోవడంతో విద్యార్థులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులు కేజీబీపీ పాఠశాలను సందర్శించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రిన్సిపల్ వీణ వివరణ..
ఈ విషయంపై ప్రిన్సిపల్ వీణ నువ్వు వివరణ కోరగా ఆదివారం కావడంతో తాను విధులకు రాలేకపోయానని  ఆమె పేర్కొన్నారు. వంట మనుషులు చేసిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటినుండి కచ్చితంగా మెనూ ప్రకారం సమయానికి భోజనం పెట్టే విధంగా చూస్తానని ప్రిన్సిపాల్ వీణా చెప్పడం జరిగింది. వంట మనుషులకు కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థులకు ఇబ్బంది పడకుండా చూస్తానని ప్రిన్సిపాల్ వీణా చెప్పడం జరిగింది.