రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో నేషనల్ వైడ్‌గా ఈ సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అక్టోబర్ 3న ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అడవిలో పులిని వేటాడే విధంగా రవితేజ తన ప్రత్యర్థులపై దాడి చేస్తున్నట్లు ప్రెజెంట్ చేసిన మాస్ అప్పీలింగ్ పోస్టర్ ద్వారా ట్రైలర్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. పోస్టర్‌లో రవితేజ డాషింగ్‌గా కనిపిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ రెండు పాటలను విడుదలై, మంచి ఆదరణ పొందాయి. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్ మదీ ఐఎస్‌సి, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.