– నాటి ఉద్యమ సారథి ఇంటికి ఆఫీస్‌కు క్యూ కట్టిన ఉద్యోగులు,ఉద్యమ కారులు, ఆశావహులు
– విద్యాశాఖ మంత్రిగా వచ్చే అవకాశాలు ?
నవతెలంగాణ-ఓయూ
జేఏసీ చైర్మెన్ ప్రొ.కోదండరాం నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పెదన్న పాత్ర పోషిం చారు. ప్రొఫెసరైన ఆయన రాష్ట్ర ఏర్పాటు కోసం వివిధ పార్టీలు, ప్రజా సంఘాలను, ఉద్యమ సంస్థలను వివిధ ప్రాంతాలు పలు ఆలోచనలు అయిన ఊరు- ఊరుకి వాడ-వాడలో జత కట్టి ఐక్యం చేసి రాష్ట్ర ఏర్పాటుకు సారధిగా, వారధిగా ఉండి జేఏసీకి రూపం తీసుకువచ్చి ప్రాణం పోశారు. తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులను కొన్ని సమయాల్లో పార్టీలను ఓర్పు నేర్పు లోక్యం తో ఐక్యం చేసి ఉద్యమానికి బాటలు వేసిన ఉద్యమ సారథి.. ప్రొ.కోదండరాం అని అన్నారు.
రాష్ట్రం కోసం తరువాత ప్రజాసమస్యలపై గళం
అలాంటి నేత కూడా రాష్ట్రం ఏర్పడిన కొన్ని సంవత్సరాల తరువాత కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొన్నారు. రాష్ట్రం ప్రభుత్వం అవలంభిస్తున్న వివిధ ప్రజావ్యతిరేకత విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించి పలు ఆందోళనలు వ్యక్తం చేసేందుకు పిలుపు ఇచ్చిన వేళా అయినను అరెస్ట్ చేసేందుకు తెల్లవారు జామున ఇంటి తలుపులు సహితం పగల గొట్టారు. అయిన అయిన ఎక్కడ నిరాశతో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలకు వ్యతి రేకంగా పోరాడుతు ఉద్యమించారు. దానిలో భాగంగా ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ విద్యార్థులు మేధావులు, ప్రజా సంఘాలు, బ్యూరో క్రాట్స్‌ను సమీకరించి గత పాలకులు ఓటమికి కిలక పా త్ర పోషించారు. తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ప్రజల వద్దకు వెళ్ళి వారిని చైతన్యం చేసి కాం గ్రెస్ పార్టీ గెలుపు తనవంతు కషి తోడ్పాటు అందజేశారు. తరువాత ఆయన ఉద్యమ నైపథ్యం మెదవితనం, పెద్దరికాన్ని చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రో.కోదండరాంకు ఎమ్మెల్సీగాగా అవకాశం ఇస్తే అది కాస్త గవర్నర్ పరిధి ఉంది. అయిన కూడా వెనక్కి తగ్గకుండా తనవంతు కషి ప్రయత్నాలు చేస్తున్నారు. వయస్సు మీద పడ్డ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వివిధ కార్యక్రమాలకు పిలిచిన పాల్గొంటు ముందుకు పోతున్నారు.ఇక ప్రభుత్వనికి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు పోతున్నారు..
విద్యా శాఖ మంత్రి ?
కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్‌లో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. దీనితో ఉన్నత విద్యా వంతుడు మేధావి గత ప్రభుత్వం ఎన్నో నిర్బంధలు ఎదుర్కొంటున్నా ఎదు రొడ్డి పోరాటం చేయడం, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కషి చేయడంతో ఆయనకు విద్యా శాఖ మంత్రిగా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నా వార్త జోరుగా సాగుతోంది.ఎమ్మెల్సీ విష యం కోర్టులో క్లియర్ ఐయ్యాకఈ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక ప్రొ.కోదండరాంకు మంత్రి తథ్యం అంటున్నారు అయిన అనుచర ఉద్యమ కారులు..
ఇంటి వద్ద ఆఫీస్ వద్ద కోలాహలంగా..
ఇక గత ప్రభుత్వం హయాంలో ప్రొ.కోదండరాం వద్దకు రావాలి లేదా వెళ్లలన్న కొందరు జంకే వారు.. ఇంకొందరు ఎందు కులే లేనిపోని విమర్శలు వస్తాయి రాద్ధాంతం అనుకోనే పరిస్థితి నెలకొంది. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దానికి భిన్నంగా ఇటు తార్నాకలో గల అయిన నివాసానికి, అటు నాంపల్లి లోని అయిన పార్టీ కార్యాలయనికి రాకపోకలు భారీగా పెరిగాయి. పలువురు ఆశావహులు వివిధ సమస్యలు ఉన్నా వారు పరిష్కరంకై కొందరు తమ సమస్యలు సీఎం లేదా సం బంధించిన మంత్రులు అధికారులు దష్టికి తీసుకువెళ్లాలని గోడు వెళ్ళ బోసుకుంటున్నారు.