మేడారం జాతరకు పటిష్ట భద్రత

–  జిల్లా ఎస్పీ గౌస్ ఆలం
– మేడారం జాతర  భద్రతా ఏర్పాట్లపై  సమీక్ష సమావేశం
నవతెలంగాణ -తాడ్వాయి
 ఫిబ్రవరిలో జరగనున్న మేడారం మహా జాతరకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. శనివారం భద్రత ఏర్పాట్లపై మేడారంలో జిల్లా ఎస్పీ, జిల్లా లోని పోలీస్ అధికారులచే సమీక్షా సమావేశం నిర్వహించారు. మహా జాతరకు వచ్చే భక్తుల భద్రత ఏర్పాట్లపై చర్చించి సమీక్షించారు. జాతరకు వచ్చు భక్తుల రద్దీని క్రమబద్ధంగా నిర్వహించులాగున రోడ్ల సౌకర్యం, చెక్ పోస్టుల ఏర్పాటు, భారీ గేట్ల ఏర్పాటు,  విఐపి వీవీఐపీల యొక్క భద్రత నిర్వహణ,  రోప్ పార్టీ నిర్వహణ,  మీడియా ప్రతినిధుల వెసులుబాట్లు, పరిమితులు మరియు ఇతర బందోబస్తు  అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 21నుండి 24 వరకు జరుగు మేడారం మహా జాతరకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దొంగతనాలు, అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటి జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి ప్రశాంతంగా వనదేవతలను దర్శించుకుని ఎవరి ఇళ్లళ్లకు వారు వెళ్లే విధంగా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి  అశోక్ కుమార్, ఏటూర్ నాగారం ఏ ఎస్ పి సిరిశెట్టి సంకీర్త్,  అదనపు ఎస్పీ సదానందం, డి ఎస్ పి సుభాష్ బాబు, డి ఎస్ పి రవీందర్, సి ఐ లు శంకర్, రాజు, రంజిత్, కిరణ్,  రోహిత్, ఆర్ ఐ అడ్మిన్ సతీష్, ఆర్ ఐ ఎం టీ ఓ సంతోష్, స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్ మిగతా జిల్లాలోని జిల్లాలోని ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు తదితరులు పాల్గొన్నారు.