తిలక్‌ వర్మ ఏ 3వ ర్యాంక్‌

Tilak Verma A 3rd rank– ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ యువ స్టార్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ సత్తా చాటాడు. ఏకంగా 69 స్థానాలను మెరుగుపరుచుకొని టాప్‌-3లో నిలిచాడు. ఐసిసి బుధవారం వెల్లడించిన టి20 బ్యాటర్ల జాబితాలో తిలక్‌ 806 రేటింగ్‌ పాయింట్లతో 3వ స్థానంలో నిలువగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ 788రేటింగ్‌ పాయింట్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. టాప్‌-10లో ముగ్గురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోగా.. యశస్వి జైస్వాల్‌(706) 8వ స్థానంలో ఉన్నాడు. టి20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు చోటు సంపాదించడం ఇదే తొలిసారి. హెడ్‌(ఆస్ట్రేలియా) 855పాయింట్లతో అగ్రస్థానంలో, సాల్ట్‌(ఇంగ్లండ్‌) 828 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు నాలుగు టి20ల సిరీస్‌లో తిలక్‌ వర్మ రెండు శతకాలతో రాణించడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది. ఈ పర్యటనలో రాణించిన మరో భారత బ్యాటర్‌ సంజు శాంసన్‌(598) 22వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్‌ స్టోయినిస్‌ నాలుగో స్థానంలో, శ్రీలంక మాజీ కెప్టెన్‌ వనిందు హసరంగ ఐదో స్థానంలో నిలిచారు.