– హైదరాబాద్ రంజీ జట్టు ఎంపిక
హైదరాబాద్: రంజీ ట్రోఫీపై కన్నేసిన హైదరాబాద్.. ఈ ఏడాది స్టార్ ఆటగాడు తిలక్ వర్మ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఈ నెల 10 నుంచి రంజీ ట్రోఫీ షురూ కానుండగా.. తొలి రెండు మ్యాచులకు సీనియర్ సెలక్షన్ కమిటీ హైదరాబాద్ జట్టును మంగళవారం ఎంపిక చేసింది. గత సీజన్‌లో రంజీ ప్లేట్ విజేతగా నిలిచిన హైదరాబాద్.. ఇటీవల ఆల్ ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్‌లోనూ చాంపియన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ ముంగిట రోహిత్‌సేనకు నెట్స్‌లో బౌలింగ్ చేసిన యువ పేసర్ నిశాంత్‌కు జట్టులో దక్కింది.
హైదరాబాద్ రంజీ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), రాహుల్ సింగ్ (వైస్ కెప్టెన్), సివి మిలింద్, తన్మరు అగర్వాల్, రోహిత్ రాయుడు, తనరు త్యాగరాజన్, అనికెత్ రెడ్డి, నితేశ్ కన్నాల, అభిరాత్ రెడ్డి, హిమతేజ, రాహుల్, రక్షణ్ రెడ్డి, కార్తికేయ, నిశాంత్, దీరజ్ గౌడ్.