ఓకే నెంబర్ ప్లేట్ తో కలప అక్రమ రవాణా

నవతెలంగాణ-కొత్తగూడ: సినిమాలు మనిషిని ఎంత ప్రభావితం చేస్తాయి అనడానికి ఈ సంఘటన నిదర్శనం గా నిలుస్తుంది. పుష్ప సినిమా లో అల్లుఅర్జున్ ఎర్రచందనం కలప స్మగ్లింగ్ చేయడానికి వినియోగించిన ట్రిక్కులను అనుసరిస్తూ కొత్తగూడ ఏజెన్సీ మండలం లడయిగడ్డ గ్రామానికి చెందిన ఓ యువకుడు టేకు కలప ను స్మగ్లింగ్ చేస్తు పట్టు బడ్డాడు. ఏజెన్సీ మండలాల నుంచి పట్టణాలకు గత కొన్ని రోజులుగా అక్రమంగా కలప తరలిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అధికారులకు దొరక్కుండా పుష్ప సినిమాలో మాదిరిగా ఒకే నెంబర్‌తో వేరు వేరు వాహనాలలో కలప అక్రమ రవాణా సాగిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
గత రెండు నెలల క్రితం ఓటాయి సమీపంలో అక్రమంగా కలప తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం రాత్రి రాంపూర్ సమీపంలోని ఎర్రవరం గ్రామంలో అక్రమంగా కలప తరలిస్తున్న మరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. విస్తుగోలిపే విషయం ఏమిటంటే నెల రోజుల క్రితం పట్టుకున్న వాహనం నంబర్ TS26TA0748 , ఆదివారం రాత్రి పట్టుకున్న వాహనం నెంబర్ TS26TA0748 ఒకే విధంగా ఉండటంతో పాటు రెండు వాహనాలు లడాయిగడ్డ గ్రామానికి చెందిన యువకుడివి కావడంతో అటవీ శాఖ అధికారులు కంగుతిన్నారు. సదరు కలప స్మగ్లర్ ఓకే నెంబర్ ప్లేట్ తోఅటవీ శాఖ అధికారులను, ఫైనాన్స్ వ్యాపారులను, పోలీసు అధికారులను బురిడి కొట్టిస్తూ యదేచ్చగా కలప అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఒకే వాహన నెంబర్ పై రెండు వాహనాలను నడుపుతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్ల పై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటే తప్ప కలప అక్రమ రవాణ ఆగదని చర్చలు వినిపిస్తున్నాయి.
కలప అక్రమ రవాణా సాగిస్తే చర్యలు తప్పవు: ఎఫ్ఆర్ఓ వజహాత్
 అధికారుల కళ్లు కప్పి కలప అక్రమ రవాణా సాగిస్తే శాఖపరమైన కఠిన చర్యలు తప్పవని ఎఫ్ఆర్ఓ వజహాత్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి అటవీ శాఖ అధికారులు తమకు అందిన సమాచారం మేరకు రాంపురం గ్రామ పరిధి ఎర్రవరం గ్రామ సమీపంలో అశోక్ లేలాండ్ లో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను, ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న కలపను స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించారు. కాగా అధికారులు స్వాధీనం చేసుకున్న అశోక లేలాండ్ వాహనంలోని కలప విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని, ద్విచక్ర వాహనంపై పట్టుకున్న కలప విలువ 10,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.కలప అక్రమ రవాణా ను చాకచక్యంగా అడ్డుకుని పట్టుకున్న బీట్ ఆఫీసర్లను, అటవీ శాఖ సిబ్బందిని ఎఫ్ఆర్ఓ అభినందించారు.
ఈ దాడిలో సెక్షన్ అధికారి రాజేష్, బీట్ ఆఫీసర్ లు వేణు, రాకేష్, రవి, సూరయ్య బేస్ క్యాంప్ సిబ్బంది శివ, నితిన్, మోహన్, వీరేష్ లో పాల్గొన్నారు