నామినేషన్లకు వేళాయె..

– విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్.. నామినేషన్లకు శ్రీకారం
– ఈనెల 25వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు స్వీకరణ
– చిన్న తప్పున్నా తిరస్కరణే.. నిబంధనలు కఠినతరం
– తొలి రోజు 4 నామినేషన్లు దాఖలు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
సార్వత్రిక ఎన్నికల సమరానికి ప్రధాన ఘట్టం గురువారం   ప్రారంభం అయింది.  ఉదయం 10గం టలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన గంట నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయింది. ఇందుకు నల్గొండ  కలెక్టరేట్లో అధికారులు కావలిసిన  ఏర్పా ట్లు చేశారు. నల్గొండ లోక్ సభ స్థానం పరిధి లో నల్లగొండ తో పాటు  దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట మొత్తం 7  నియోజకవర్గాలు ఉన్నాయి. 17,22521 మంది ఓటర్లు ఉండగా 84 34 96 మంది పురుషులు, 87 88 56 మంది మహిళలు, 169 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.  కలెక్టరేట్ లో  నామినేషన్లను  జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరిచందన  దాసరి స్వీకరించారు. కలెక్టరేట్ పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా 144 సెక్షన్ విధించారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3గం. టల వరకు నామినేషన్లను స్వీకరించనుండగా హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, ప్రజలు కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న  రెండోగేట్ నుంచి రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేశారు.
ఒకరి ప్రతిపాదన ఉంటే  చాలు…
జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసే సమయం లో అదే లోక్ సభ నియోజకవర్గంలో ఎవరైనా ఒక ఓటరు ప్రతిపాదించాలి. అభ్యర్థి మాత్రం రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా ఓటరై ఉండాలి. రిజిస్టర్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేస్తే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతి పాదించాల్సి ఉంటుంది. ప్రతిపాదించేవారు నిరక్ష రాస్యులైతే ఆర్వో ఎదుట నామినేషన్ స్వీకరణకు ముందు, తర్వాత వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ప్రతిపాదించే వారి సంతకాన్ని అభ్యర్థులు ఫోర్జరీ చేసినట్లు తేలితే నామినేషన్ తిరస్కరణకు గురికావ డంతో పాటు కేసు నమోదు చేయనున్నారు.
ఫాం 2 ద్వారా నామినేషన్..
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఫాం 2-బీ ద్వారా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఫాం-26 ద్వారా ఆఫిడవిట్ దాఖలు చేయాలి. దీం ట్లో అభ్యర్థికి సంబంధించిన వివరాలు ఆస్తులు, రా బడి, ఖర్చు, అప్పులు, క్రిమినల్ కేసులు, రాబడి పన్ను నమోదు చేయాలి. అఫిడవిట్లో అన్ని కాలమ్ లు పూరించాలి. ఏదైనా కాలమ్ వదిలి వేసినట్లయి తే ఆర్వో నుంచి నోటీసు అందుకోవాల్సి వస్తుంది.
అభ్యర్థితో నలుగురికి అవకాశం…
నామినేషన్ కేంద్రాలకు వెళ్లడానికి అభ్యర్థితో పాటు మరో నలుగురికి, మూడు వాహనాలకు మాత్రమే అనుమతినిస్తారు. రిటర్నింగ్ ఆఫీస్ కు  వంద మీటర్ల దూరం వరకు వాహనాలకు అనుమతి ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్తో పాటు అభ్యర్ధులు బ్యాం కు ఖాతా వివరాలను ఆర్వోకు అందజేయాలి. ఏదై నా జాతీయబ్యాంకు నుంచి కొత్తగా ఖాతా తెరవాలి. ఎన్నికలు పూర్తయ్యే వరకు అదే ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహించాలి. నామినేషన్ వేసే సా ధారణ అభ్యర్థులు రూ.25 వేలు డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.12500 వేలు చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో నగదు స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు.
నామపత్రాలు పొందొచ్చు కలెక్టరేట్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గం టల వరకు నామినేషన్లను అభ్యర్థులు, వారి తర పున హాజరయ్యే వారి నుంచి స్వీకరిస్తారు. ఈ నెల 21న ఆదివారం సెలవుదినం కావడంతో నామినేష న్ల స్వీకరణ ఉండదు. అభ్యర్థి నాలుగు సెట్ల నామప త్రాలు అందజేయవచ్చు. ఖాళీ నామినేషన్ సెట్లను గురువారం నుంచి కలెక్టరేట్ ఆర్వో కార్యాలయం నుంచి పొందవచ్చని అధికారులు వివరించారు.
నీడలా నిఘా.. సహాయ కేంద్రం
కలెక్టరేట్లో నిఘాను తీవ్రతరం చేశారు. కలెక్టర్ చాంబర్ కారిడార్ తో పాటు సముదాయంలో సీసీ కెమె రాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు, పార్టీల వారికి సహకరించేందుకు ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలను ఈసీ వెల్లడించనుంది. నామినేషన్ దాఖలు చేసిన ప్రతీ అభ్యర్థి ఆఫిడవిట్ పత్రాలను 24గంటల్లోనే ఎలక్షన్ వెబ్సై బ్లో ప్రదర్శించనున్నారు. కలెక్టరేట్ నామినేషన్ల స్వీకరణ కేంద్రం కాగా 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ర్యాలీగా వచ్చే అభ్య ర్ధులు కలెక్టర్ కార్యాలయానికి వంద మీటర్ల దూరం లోనే ర్యాలీని ఆపేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా
నామినేషన్ల నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 18
స్వీకరణ: ఏప్రిల్ 18 నుంచి 25
పరిశీలన: ఏప్రిల్ 28
ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 29
పోలింగ్: మే 13
ఓట్ల లెక్కింపు: జూన్ 04
తొలి రోజు  నామినేషన్లు..
తొలిరోజు 4 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తొలి నామినేషన్ పత్రాన్ని  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్  జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హరిచందన దాసరి కి  అందజేశారు. రెండవ నామినేషన్ బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున బిజెపి రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్ తదితరులు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఆర్. సుభద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తొలిరోజు నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్ దాకలు  చేశారు.