నవతెలంగాణ – హలియా
స్థానిక టైం పాఠశాలలో అగ్నిప్రమాదలను ఎలా నివారించవచ్చు అనే అంశం పై హాలియాలో ని ఫైర్ స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు అవగాహన కలిగేలా కొన్ని ప్రయోగాలు చేసి, అందరికి అర్ధమయ్యేలా వివరించారు. వచ్చే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని అగ్నిప్రమాదలకు గురికాకుండా అగ్నిని ఎలా ఆపాలో వివరంగా చెప్పినారు. వారు చేసిన ప్రయోగాలు విద్యార్థులను ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఎస్ ఐ జానయ్య పాల్గొనడం జరిగింది. ఎన్నో విషయాలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మందా నరేందర్ రెడ్డి ప్రిన్సిపాల్ కత్తి కోటి రెడ్డి మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.