
– ఆదర్శ,ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన
నవతెలంగాణ – బెజ్జంకి
ప్రతి ఒక్కరూ సమయానుకూలంగా వ్యవహరిస్తే మానసిక ఒత్తిడిని జయించవచ్చునని ఇంపాక్ట్ పౌండేషన్ వ్యక్తిత్వ వికాస నిపుణులు మంద జనార్ధన్ తెలిపారు. గురువారం స్వేరోస్ నెట్ వర్క్ జిల్లాధ్యక్షుడు ఉప్పులేటి బాబు అధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ,బాలికల,బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు మంద జనార్ధన్ అవగాహన కల్పించారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి జయించడం,సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించే విధానం, పదవ తరగతి తర్వాత ఉన్నత స్థాయిలో నిలిచేందుకు దోహదపడే విద్యా కోర్సులపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో తమవంతుగా సమాజ సేవలో బాగాస్వాములవ్వాలని సూచించారు. అనంతరం స్వేరోస్ నెట్ వర్క్ అధ్వర్యంలో ఆదర్శ,బాలికల,బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి,మంద జనార్ధన్ కు శాలువా కప్పి ఘనంగ సన్మానించారు.అయా పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.