టిప్పర్ భీ బత్సమ్.. 90 గొర్లు మృత్యు వాత..

– ఆగి ఉన్న కారును, ఆబ్లెంన్సు ను
– ఆర్టీసి బస్సును ఢీ కొట్టిన టిప్పర్
నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం సమ్మక్క సారక్క సమీపంలోని నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారి దయ్యాల గండి వద్ద టిప్పర్ అదుపు తప్పి
భీబత్సమ్ సృష్టించింది. ఈ సంఘటన శనివారం మధ్యాహన్నం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గొర్రెల కాపరులు వాటిని తోలుకొని వారి ఇంటికి వెళుతుండగా పెద్దవూర మండలం సమ్మక్క సారక్క ఆలయ సమీపంలోని హైదరాబాద్, నాగార్జున సాగర్ ప్రదాన రహరి సాగర్ మున్సిపాలిటీ సమీపంలోని దయ్యాల గండి వద్ద కు రాగానే పెద్దవూర నుంచి సాగర్ వైపు వేగంగా వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ముందుగా ఆగి ఉన్న కారును, అంబులెన్స్, ఢీకొని మాచర్ల నుంచి నల్లగొండ వెళ్తున్న గొర్రెల మంద పైకి దూసుకెళ్ళింది. దాంతో సుమారు 90 గొర్రెలు మృతి చెందాయి. అంతటి తో ఆగక ఎదురుగా వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం ఆర్టిసి బస్సు కి తాకి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న సాగర్ పోలీసులు సంఘటన స్తలానికి వచ్చి చనిపోయిన గొర్రెలను రోడ్డు పక్కకు పెట్టారు. ట్రాఫికి అంతరాయం కలగకుండా చేశారు. అతివేగం, నిర్లక్షం కారణంగా గొర్రెలు మృతి చెందడంతో టిప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.