
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని నయాబాది సమీపన బుధవారం నిర్మల్ జిల్లా మైనింగ్ ఇన్స్పెక్టర్ కే. ఆనంద్ సంబందిత పత్రాలు లేకుండా మట్టి, ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుంచి బైంసా వైపు వస్తున్న ఇసుక టిప్పర్, అలాగే విట్టోలి రోడ్డు నుంచి నుంచి ముధోల్ కువస్తున్న మట్టి టిప్పర్ లకు సంబంధిత అనుమతి పత్రాలు లేని కారణంగా వాహనాలను స్వాధీనం చేసుకొని ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతి లేకుండా మొరం,మట్టి, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.