టిప్పు టాపు ‘ట్యాపు’

Tipu Tapu 'Tapu'కుళాయిలు ట్యాపులంటే ఇప్పుడందరి ఇళ్లల్లో ప్రతీగదిలో కామన్‌ అవుతోంది. ఇంతకు ముందు అయితే ట్యాప్‌ ఇప్పితే నీళ్ళు రావడం.. కట్టేస్తే ఆగిపోవడం అయిపోయేది. ఇప్పుడలాకాదు చేయి దగ్గర పెట్టగానే వాటర్‌ రావడం, చేయి తీస్తే ఆటోమాటిగ్గా ఆగిపోవడం, నీరు ఆదా అవ్వడంతో అందరూ వీటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దీంతో సజనాత్మకత మేళవించి ఎన్నో కంపెనీలు వీటిని డిఫరెంట్‌ లుక్స్‌ తో మార్కెట్‌ లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇంటీరియర్‌ డెకరేషన్‌ లో ట్యాపు లుక్కూ చమక్కుమంటోంది. ఆటో ఆన్‌ ఆఫ్‌ గల ట్యాపులు తళుకులీనుతూ మెరుస్తూ మురిపిస్తూ ఉంటాయి. సిరికొద్దీ చిన్నెలు అనే మాట ట్యాపుకీ సూటవుతోంది. మదిని మెచ్చే.. గదికి నచ్చే ట్యాపు ఇప్పుడు ఇంటికి అదనపు శోభ.
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌