
మండల పరిధిలోని వడ్లూరు గ్రామ మున్నూరు కాపు సంఘాధ్యక్షుడిగా గాండ్ల తిరుపతి అదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా తిరుపతి, కార్యదర్శిగా గాండ్ల బాలయ్య ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ కార్యవర్గ సభ్యులను మున్నూరు కాపు సంఘం సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.