సంత్ సేవాలాల్  జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి: తిరుపతి నాయక్

నవతెలంగాణ –  హుస్నాబాద్ రూరల్ 
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ  సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటిస్తూ అధికారికంగా నిర్వహించాలని బీఆర్ఎస్  ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు గూగులోతు  తిరుపతి నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక కెసిఆర్  2018లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా జాతికి చేసిన సేవలకు గుర్తించారని, తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకి కోటి రూపాయలను కేటాయించి నట్లు  తెలిపారు. బంజారాల ఆత్మ గౌరవాన్ని సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించే దిశగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 న శ్రీ సేవాలాల్ మహారాజ్  జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించేవారన్నారు. హుస్నాబాద్ పట్టణంలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలతో బంజారా భవనాన్ని మంజూరు చేసిందన్నారు. ఆ ఆభవనాన్ని పూర్తి చేసి  శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను జరపాలని కోరారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకి పది శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  ఎస్టీ సెల్ నాయకులు గుగులోతు రాజు నాయక్ ,కృష్ణ నాయక్,  మాలోతు సత్యం నాయక్ ,భూక్య వీరన్న నాయక్, భూక్య తిరుపతి నాయక్ ,అజ్మీర తిరుపతి నాయక్  తదితరులు పాల్గొన్నారు.