టైటాన్స్‌ హ్యాట్రిక్‌ ఓటమి

Titans hat trick defeat– 41-37తో దబంగ్‌ ఢిల్లీ కెసి గెలుపు
– ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11
హైదరాబాద్‌ : ప్రొ కబడ్డీ లీగ్‌లో సీజన్‌ మారినా.. తెలుగు టైటాన్స్‌ కథ మారటం లేదు. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో టైటాన్స్‌ హ్యాట్రిక్‌ పరాజయం చవిచూసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో శనివారం దబంగ్‌ ఢిల్లీ కెసితో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 37-41తో ఓటమి చెందింది. దబంగ్‌ ఢిల్లీ కెసి ఆటగాళ్లలో నవీన్‌ కుమార్‌, ఆషు మాలిక్‌ 15 పాయింట్ల చొప్పున సూపర్‌ షో చేశారు. తెలుగు టైటాన్స్‌ తరఫున పవన్‌ సెహ్రావత్‌ 18 పాయింట్లతో చెలరేగినా ఫలితం దక్కలేదు. ఆశీస్‌ నర్వాల్‌ 9 పాయింట్లతో రాణించినా.. తెలుగు టైటాన్స్‌ 4 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. పీకేఎల్‌ 11వ సీజన్లో మూడు మ్యాచుల్లో దబంగ్‌ ఢిల్లీ కెసికి రెండో విజయం కాగా.. తెలుగు టైటాన్స్‌కు నాలుగు మ్యాచుల్లో ముచ్చటగా మూడో ఓటమి.