అశ్వారావుపేట కాంప్లెక్సు లో తిధిభోజనం

Tithi Bhojana in Ashwaraopeta Complexనవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సముదాయం లోని వివిధ పాఠశాలల్లో దాతల సహకారంతో విద్యార్ధులకు తిధిభోజనం పంపిణీ చేసారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జె.వి.ఆర్ వెజిటబుల్స్ ,కేశవ ఫెర్టిలైజర్స్ అశ్వారావుపేట వారి సహకారంతో తిధిభోజనాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనం మెనూ తోపాటు అదనంగా కూరలు, స్వీటు,అరటిపండు తో భోజనాన్ని వడ్డించారు. గత వారం రోజులుగా అన్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ్ ముగింపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా,కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు రాలు పి.హరిత మాట్లాడుతూ విద్యార్ధులకు అందిస్తున్న పి.యం.పోషన్ లో భాగంగా అదనపు పోషక విలువలను అందించుటకు గాను ఈ తిధి భోజనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ,తిధిభోజన కార్యక్రమం ద్వారా  విద్యార్ధులకు పోషక విలువలు లభించడమే గాక పాఠశాలల్లో నమోదు మరియు హాజరు ను పెంచడానికి,పిల్లలో సాంఘికీకరణను మెరుగుపర్చడానికి దోహదపడుతుందని అన్నారు. దాతలు జె.వి.ఆర్. వెజిటబుల్స్ ,కేశవ ఫెర్టిలైజర్స్ యాజమాన్యానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మధ్యాహ్నం భోజనం ఇంచార్జి మధు,ఊడల కిషోర్ బాబు,నర్సింహారావు,సాజీదా ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.