నవతెలంగాణ – గోవిందరావుపేట
తాతలు తండ్రుల కాలం నుండి సాగు చేసుకుంటున్న పోడు భూముల రైతులకు హక్కు పత్రాలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెండ్యాల దేవరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పోడు రైతుల కు హక్కు పత్రాలు కల్పించాలంటూ 163 వ జాతీయ రహదారిపై రాస్తారోకో మరియు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు పోడు రైతులతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా డాక్టర్ దేవరాజ్ మాట్లాడుతూ గిరిజన గిరిజన రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు అయినా పట్టాదారు పాసుపుస్తకాలు కల్పించడంతోపాట వ్యవసాయ రుణాలు సబ్సిడీపై విత్తనాలను ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. పోడు రైతులు సాగు చేసుకుంటున్న భూములలో అటవీ అధికారులు అక్రమంగా నాటిన చెట్లను సంబంధిత రైతులకు అప్పగించారని అన్నారు.
అటవీ హక్కుల చట్టాన్ని గిరిజన ఇతర రైతులకు కూడా వర్తించే విధంగా చట్టాన్ని రూపొందించాలని సూచించారు. పోడు రైతులు కవులు రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వము ప్రకటించి కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. అర్హత ఉండి ఇల్లు లేని దిగువ తరగతి రైతాంగానికి ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని అమలు చేయాలన్నారు. పేదల రాజ్యస్థాపనకై హక్కుల సాధనకై నిరంతరం నిర్విరామంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాహసిల్దార్ సతీష్ కు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రయ్య, మండల అధ్యక్షులు రేగ నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, వెంకటరామిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు, బాలరాజు మండల ఉపాధ్యక్షులు, కల్తీ సాంబయ్య మండల ఉపాధ్యక్షులు, ఉప్పలయ్య సహాయ కార్యదర్శి తదితరులు తోపాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.