నవతెలంగాణ -హైదరాబాద్
ప్రజాసమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే కేసులు పెట్టడాన్ని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్(టీజేఎఫ్) ఖండించింది. విద్యుత్ సమస్యను ఎక్స్ వేదికగా సర్కారు దృష్టికి తీసుకుపోయిన జర్నలిస్టు రేవతిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా జర్నలిస్టులు ప్రయత్నం చేస్తారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రవికుమార్, ఉప ప్రధాన కార్యదర్శి మహేశ్వరం మహేంద్ర తెలిపారు.