నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజీఎమ్‌యూ) శుక్రవారం టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. అదే సమయంలో కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు కూడా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నోటీసు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎమ్‌యూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీవీకే రావు, కే హన్మంతు ముదిరాజ్‌తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.వేతన సవరణ, వెల్ఫేర్ బోర్డుల రద్దు, కార్మిక సంఘాలకు అనుమతి, కొత్త నియామకాలు, మహిళా కండక్టర్లు, కారుణ్య నియామక అభ్యర్థుల సమస్యలు సహా మొత్తం 19 డిమాండ్లతో కూడిన నోటీసులను అందచేశారు.