ప్రొఫెసర్‌ కోదండరాంకు టీఎన్జీవో సంఘం అభినందనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాంకు టీఎన్జీవో సంఘం అభినందనలు తెలిపింది. గవర్నర్‌ కోటాలో ఆయన ఎమ్మెల్సీ అయిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, పర్వతాలు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్‌, లక్షణ్‌ తదితరులు కోదండరాంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుని సేవలను గుర్తించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్ర ఉద్యోగులు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.