సీఎం రేవంత్‌ను కలిసిన టీఎన్జీవో నేతలు

సీఎం రేవంత్‌ను కలిసిన టీఎన్జీవో నేతలునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డిని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ఎం సత్యనారాయణగౌడ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ముజీబ్‌ హుస్సేని, నాయకులు పర్వతాలు, శంకర్‌ తదిత రులు శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి అభినందనలు ప్రకటించారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఆకాంక్షలకనుగుణంగా అనేక హామీలను మ్యానిఫెస్టోలో చేర్చిన కారణంగానే కొత్త ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.