
శాసనమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని, జిల్లా టీఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి, ఘనంగా బుధవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, సలహాదారులు ఆకుల ప్రసాద్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, దినేష్ బాబు, ఉమా కిరణ్, తదితరులు పాల్గొన్నారు.