ఫిట్‌గా ఉండాలంటే…

ఫిట్‌గా ఉండాలంటే...చాలామంది ఆరోగ్యంగా ఉండాలని ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ అందుకు కావలసిన జీవన విధానాన్ని మాత్రం అనుసరించరు. ఫలితంగా అనారోగ్యం బారిన పడతారు. ఆరోగ్యం కోసం ఏం చేసినా అది షార్ట్‌ టర్మ్‌ మాత్రమే చేస్తారు. కొద్ది రోజులు జిమ్‌ చేయడం, కొద్ది రోజులు యోగా చేయడం, కొద్దిరోజులు డైట్‌ ఫాలో అవడం… ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే, శారీరకంగా ఫిట్‌గా ఉండాలంటే క్రమబద్ధమైన జీవన విధానం ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం కోసం ఎటువంటి షార్ట్‌ కట్‌ లు ఉండవు. కచ్చితంగా ఎప్పుడు పాటించవలసిన నియమాలే ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ప్రతిరోజూ కనీసం అరగంట నుండి గంట సేపు వ్యాయామం చేయాలి.
క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. సమయం ప్రకారం ఆహారాన్ని తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినడం మంచిది కాదు. సమయం ప్రకారం మంచి పౌష్టికాహారాన్ని తినాలి. ఆన్ని పోషకాలు ఉన్న ఆహారంపై అవగాహన ఉండాలి. అలాంటి ఆహారమే తీసుకోవాలి.
కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. శరీరానికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి, కావలసినంత విశ్రాంతినిచ్చి అవసరమైనంత శ్రమ చేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఫిజికల్‌ గా ఫిట్‌ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగాను, ఫిట్‌ గాను ఉండాలి అనుకునేవారు జిమ్‌ లని, ఏరోబిక్స్‌ అని పరుగులు పెట్టకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడాన్ని అలవర్చుకోవాలి.
ఏది చేసినా అది జీవితంలో భాగం కావాలి. ఇక వ్యాయామం చేయలేము అనేవారు తప్పనిసరిగా రోజుకు పదివేల అడుగులు నడిచి తీరాలి. ఈ పని ఎవరైతే చేస్తారో వారు తప్పనిసరిగా బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఫిజికల్‌ గానూ ఉంటారు.