నిల్వ ఉండాలంటే…

To be stored...సాధారణంగా వంటింట్లో వివిధ రకాల పదార్థాలను స్టోర్‌ చేస్తాం. ఉల్లిగడ్డల నుంచి పప్పు ధాన్యాల వరకు అన్నీ కిచెన్‌లో ఉంటాయి. అయితే సరిగా నిల్వ చేయకపోతే వీటికి పురుగు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా పప్పు ధాన్యాలకు ఈ రిస్క్‌ ఎక్కువ. చాలా మంది దోశ, ఇడ్లీ, వడ వంటి టిఫిన్లు చేసుకోవడానికి మినప్పప్పు తెచ్చి కిచెన్‌లో స్టోర్‌ చేస్తుంటారు. దీన్ని డబ్బాల్లో ఎక్కువ కాలం ఉంచితే చిన్న పురుగులు, తవిటిపురుగు చేరే అవకాశం ఉంది. శనగలకు కూడా వీటి బెడద ఎక్కువే. వీటికి పురుగులు పట్టకుండా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందా.
ఎండబెట్టడం
శనగపప్పు, మినప్పప్పులో తేమ ఎక్కువ. దాంతో త్వరగా పురుగులు పట్టే అవకాశం ఉంది. అందుకే వీటిని కొన్న తర్వాత శుభ్రంగా కడిగి కనీసం 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. దీంతో వాటిలోని తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. మినప్పప్పును లైట్‌గా ఫ్రై చేయడం మంచిది. దీంతో పప్పుకు పురుగులు పట్టవు. వీటిని ఒక గాజు సీసా లేదా ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో స్టోర్‌ చేయాలి. ఆ కంటైనర్‌ లేదా పాత్రను చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి.
బిర్యానీ ఆకులు
శనగ పప్పు, మినప్పప్పుకు పురుగులు పట్టకుండా ఉండాలంటే, స్టోరేజీ కంటైనర్‌లో బిర్యానీ ఆకులు వేయాలి. ఈ ఆకుల వాసన పురుగులను వికర్షిస్తుంది. పప్పు తేమను నిలుపుకునేలా చేస్తూనూ ఓ మంచి ఫ్లేవర్‌ కూడా ఇస్తుంది.