విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీయాలి

– పాఠశాల డైరెక్టర్‌ మణి మాలా రెడ్డి
– శ్రీనేతాజీ గురుదేవ్‌ గురుకుల్‌ పాఠశాలలో ఘనంగా వార్షిక సాంస్కతిక కల్చరల్‌ ప్రోగ్రాం
నవతెలంగాణ-తాండూరు
విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీసేం దుకు వివిధ రకాల కార్యక్రమాలు ఉప యో గపడతాయని పాఠశాల మణిమాల రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్‌ గురుకుల్‌ పాఠశాలలో శనివారం నేతాజీ జయంతి సందర్భంగా వార్షిక సాంస్కతిక కల్చ రల్‌ ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవర ణలో ఏర్పాటుచేసిన ఈ కల్చరల్‌ ప్రోగ్రాంలో విద్యా ర్థులు వివిధ రకాల స్కాంస్కతిక సాంప్రదాయ గేయా లతో ఆటలు ఆడి పాడారు అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో నేతాజీ చేసిన వీర పోరాటంపై ప్రదర్శ నలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్‌ యాజమాన్య నిర్వాకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నేతాజీ జయంతిని పురస్కరించు కొని పాఠశాలలో యానివల్‌ కర్చలర్‌ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇం దుకు సహకరించిన విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ శివలీల డైరెక్టర్‌ మని మాలా రెడ్డి, విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.