విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయాలి..

Talent should be brought out among the students..– జిల్లా యువజన క్రీడా శాఖ అధికారికి విన్నవించిన ఎస్ఎఫ్ఐ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సీఎం కప్ 2024 ని నిర్వహించి విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయాలని నిజామాబాద్ జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ముత్తన్నకి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో  బుధవారం వినతిపత్రం అందజేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో సీఎం కప్- 2024 నిర్వహించి మారుమూల ప్రాంతాల విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలని జిల్లా యువజన క్రీడా శాఖ ఆఫీసర్ ను కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడలలో ఎదిగేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా సీఎం కప్పు నిర్వహణ కు ప్రభుత్వం ఆరు లక్షల బడ్జెట్ నుండి పది లక్షల వరకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగం తో పాటు క్రీడలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. అదే విధంగా జిల్లా క్రీడల తేదీలను ప్రకటించాలని కోరారు. వారు సానుకూలంగా స్పందించి సీఎం కప్ విజయవంతం చేయడానికి కృషి చేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దినేష్, అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.