– పెట్రోల్ బంకు పునః ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి
నవతెలంగాణ-బెజ్జంకి
రైతుల సంక్షేమమే ద్యేయంగా సేవలందిస్తున్న పీఏసీఎస్ అభివృద్ధికి అందరూ దోహదపడాలని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని బేగంపేట గ్రామ శివారులోని పీఏసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నాస్కాభ్ జాతీయ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావుతో కలిసి పునః ప్రారంభించారు.పీఏసీఎస్ అందించే నాణ్యమైన ఇందనాన్ని రైతులు,వాహనదారులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు.ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,వైస్ చైర్మన్ చిలువేరు శరీనిాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,పీఏసీఎస్ డీఎస్ఓ నాగేశ్వర్ రావు,డైరెక్టర్లు బెజ్జంకి నరేశ్,సీత భూమయ్య,దీటి బాలనర్స్,గూడెల్లి లక్ష్మన్,ఎల్కంటి తిరుపతి రెడ్డి,అన్నాడి రవీందర్ రెడ్డి,సీఈఓ శ్రీనివాసు,సిబ్బంది బుచ్చయ్య,భాను,అనిల్,మల్లేశం, కాంగ్రెస్ శ్రేణులు,అయా గ్రామాల రైతులు హజరయ్యారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అయా గ్రామాల 27 మంది లబ్ధిదారులకు సుమారు రూ.7.48 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు.
రూ.5 లక్షల ఎక్స్ గ్రేసీయా అందజేత..
మండల పరిధిలోని తోటపల్లి గ్రామానికి చెందిన సందిరి లక్ష్మన్ ఇటీవల వరద ఉదృతిలో మృతి చెందిన విషయం విదితమే. మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మృతుని కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకులతో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేసీయా చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.