నెలసరిలో చాలా మంది పొత్తి కడుపులో నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. దీంతో పాటు కొందరికి అధిక రక్తస్రావం కూడా అవుతుంది. దీనివల్ల ఏ పనీ చేయకుండా రోజంతా నీరసంగా ఉంటారు. పీరియడ్స్‌లో ఆరు నుంచి ఏడు రోజుల వరకు బ్లీడింగ్ అనేది సాధారణమే. కానీ అధికంగా అయితే మాత్రం ప్రమాదమే. ఎక్కువ రోజుల ఇలానే అయితే రక్తహీనత, శ్వాస సమస్య, అలసట వంటి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవేంటో చూద్దాం.
– పీరియడ్స్ బ్లీడింగ్ నుంచి ఉపశమనం పొందాలంటే సోంపు నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. సోంపు గింజలను డైరెక్ట్‌గా లేదా పౌడర్ చేసుకుని నీళ్లలో మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తాగితే వెంటనే బ్లీడింగ్ అదుపులో ఉంటుంది.
– పొట్ట కింద ఐస్ ప్యాక్ పెట్టుకున్నా హెవీ బ్లీడింగ్‌ను తగ్గించడంతో పాటు పొత్తి కడుపులో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
– ఓక టేబుల్ స్పూన్ మెంతులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి స్పూన్ తేనెలో కలిపి గోరు వెచ్చగా తాగాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేయడం నొప్పి నుంచి విముక్తి పొందొచ్చు.
– పీరియడ్స్ సమయంలో తీవ్రంగా నొప్పి వస్తే నిద్రపోవడం మంచిది. నిద్రలోకి వెళ్లిన తర్వాత హార్మోన్ల స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. దీంతో బ్లీడింగ్, నొప్పి తగ్గుతాయి.
– పీరియడ్స్ సమయంలో అధికంగా రక్తస్రావం అయితే రక్తహీనత సమస్య బారిన పడతారు. ప్రతీ నెల ఇలానే అధికంగా జరగుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.