బీసీలకు న్యాయం జరిగేలా చూడాలి ..

Justice should be done to BCs..నవతెలంగాణ-ధర్మసాగర్
బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలని మత్స్య పారిశ్రామిక  సహకార సంఘాల అధ్యక్షులు జిల్లా డైరెక్టర్ పిట్టల సత్యనారాయణ అన్నారు.మండల కేంద్రంలో బుధవారం మత్స్య పారిశ్రామికుల సమస్యలను పరిష్కరించాలని గోడపత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.ఫిబ్రవరి రెండో తారీఖు నాడు జరగబోయే బీసీ గర్జనకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు అన్ని మద్దతు ఇస్తున్నాయని,ఈ సందర్భంగా అందరూ సొంత వాహనాలు ఆర్ట్స్ కాలేజ్ బీసీ గర్జనకు ప్రజలను బీసీలను పెద్ద ఎత్తున తరలించాలని ఈ సందర్భంగా కోరారు.బీసీల సమస్యలకు తగిన న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి మత్స్య కార్మికులు ఈ బీసీ గర్జనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని మత్య  సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.