రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
డిఫరెంట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో మేకర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. ఈ అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఈనెల 9న టీజర్‌ను విడుదల చేస్తున్నారు. దీంతో మెగాభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఎగ్జైట్‌మెంట్ మరింత పెరిగింది. టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ గమనిస్తే రైల్వే ట్రాక్‌పై రామ్‌చరణ్ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని లుంగీ, బనియన్‌తో పక్కా మాస్ లుక్‌లో అందర్నీ అలరిస్తున్నారు.
ఈ లుక్ ఉన్న పోస్టర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ సినిమాలో ట్రైన్ ఫైట్ ఉండబోతుందని, ఆ ఫైట్ అందరి అంచనాలను మించేలా ఉంటుందని చెప్పటంతో అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ సాంగ్స్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చాయి. డైరెక్టర్ శంకర్ లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించటమే కాకుండా, అభిమానులకు, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంటారు. రామ్ చరణ్‌లాంటి మాస్ హీరో ఉన్నప్పుడు ఆ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాలని మెగాభిమానులు, మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను మించేలా దీన్ని ఆయన రూపొందిస్తున్నారు. పవరఫుల్ రోల్‌లో చరణ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు శంకర్. రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ‘ఎ’ ఫిల్మ్స్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకుంది. ఈ భారీ చిత్రానికి తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్స్ ప్రైజ్‌కి దక్కించుకుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు.