
– ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, చింతల కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
నేటి సమాజంలో బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించాలంటే చదువొక్కటే సాధ్యమని ఆర్టీఐ నాయకులు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, చింతల కుమార్ యాదవ్ అన్నారు.కాటారం మండల కేంద్రంలో మాట్లాడారు ఆడపిల్లని మా ఇంటి మహాలక్ష్మిని,స్త్రీని దేవతతో పోల్చుతారన్నారు.కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఇందుకు భిన్నంగా నిత్యం వారిపై ఎదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటా బయటా అనేక ఆంక్షలు ఉంటాయని,ఆడపిల్లల జీవించే హక్కు మగపిల్లల జీవించే హక్కు లాగా గౌరవింపబడడం లేదన్నారు. చాలా దేశాల్లో అమ్మాయి పుట్టాలన్న కోరిక కంటే అబ్బాయి పుట్టాలన్న కోరిక ఎక్కువగా ఉంటుందని, అమ్మాయి పుడుతుందని తెలిసినప్పుడు అబార్షన్ చేయించుకోడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో ఒక వేళ ముందు అమ్మాయో, అబ్బాయో తెలియకపోతే అబ్బాయి కావాలనుకున్నప్పుడు అమ్మాయి పుడితే అమ్మాయిని చంపేయడానికి కూడా వెనుకాడటం లేదని,అమ్మాయిలకి సురక్షితంగా ఉండే వాతవరణం ఉండి, చక్కని చదువు ఉండి, ఆరోగ్యకరమైన జీవితం గడపగలిగే అవకాశం ఉంటే వారు తల్లులుగా, వ్యాపార వేత్తలుగా, గృహిణులుగా, రాజకీయ నేతలుగా ఎదిగి దిశానిర్దేశం చేయగలుగుతారని తెలిపారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆడపిల్లలకి అవన్నీ లభిచటం లేదని,ఎన్నో హక్కులు వారు.అనుభవించలేకపోతున్నారని తెలిపారు. ప్రతి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలిక దినోత్సవం జరుపుతారు కానీ మనదేశంలో జనవరి24న జాతీయ బాలికల దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు.అంతర్జాతీయ మహిళ దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యత బాలికల,దినోత్సవానికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ముత్తోజు వెనాచారి పాల్గొన్నారు.