వాసన పోగొట్టాలంటే..

వాసన పోగొట్టాలంటే..అందరి ఇండ్లల్లో ఫ్రిజ్‌ కామన్‌ అయిపోయింది. చాలా రకాలుగా అది మనకు ఉపయోగపడుతున్నది. కూరగాయల దగ్గర నుంచి మొదలుపెడితే… కూరలు, పిండ్లు, పొడులూ అన్నీ అందులో తోసే స్తున్నాం. ఇలా ఫ్రిజ్‌లో రకరకాలు ఉండటం వల్ల ఫ్రిజ్‌ నుంచి ఒక్కోసారి వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దానిని పోగొట్టాలంటే.. ఈ చిట్కాలను ఒకసారి ప్రయత్నిoచండి. ఫ్రిజ్‌లోంచి వచ్చే వాసన పొతుంది.
ఎక్కడి నుంచి వస్తుంది:
ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది అనేది గుర్తించాలి. వెంటనే వాటిని తొలగించండి. అలాగే ఆహార పదార్థాలు పెట్టి మర్చిపోవడం వల్ల కూడా బ్యాడ్‌ స్మెల్‌ వస్తుంది. కాబట్టి ముందు అవేంటో గుర్తించి.. వాటిని తొలగించండి.
నిమ్మతొక్కలతో..
కూరగాయలు, ఆహార పదార్థాలు, పువ్వులు చాలా త్వరగా కుళ్లిపోతూ ఉంటాయి. వీటి వలన ఫ్రిజ్‌ మొత్తం చెడు వాసన వస్తుంది. ఇలా రాకుండా ఒక చిన్న ప్లేట్‌ లేదా గిన్నె తీసుకోండి. అందులో నిమ్మ తొక్కలు, ఉప్పు, బేకింగ్‌ సోడా వేసి పెట్టండి. ఇది డియోడరైజర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రిజ్‌లో ఏదో ఒక చోట పెట్టండి. ఫ్రిజ్‌ నుంచి చెడు వాసన రాకుండా చేస్తుంది.