జాతీయ క్రీడాకారులుగా ఎదగాలి…

నవతెలంగాణ – బజార్ హత్నూర్: గ్రామీణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం మండలంలోని చింతలసాంగ్వీ గ్రామంలోని ఆదివాసి యుత్ ఆద్వర్యంలో అంతర్రాష్ట్ర కబడ్డి టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొన్నప్పుడే మానసిక వికాసం, శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. నేర్చు కోవాలనే కోరిక, ఆడి గెలవాలనే పట్టుదల ఉంటే పల్లె నుంచి కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు  మల్లెపూల నర్సయ్య, మునేశ్వర్ నారాయణ, మాజీ వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ జల్కె పాండురంగ్, నాయకులు శివుడు, శేఖర్, గ్రామస్తులు భీమ్రావు, హన్మంతు, జగదిష్, లక్ష్మన్, భుమన్న, మరుతి ఆదివాసి యుత్ అద్యక్షుడు సిడం సుబాస్, యుత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.