మహానీయునిపై ఇంత చిన్న చూపెందుకూ..!

– ఎమ్మెల్యే, కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ నాయకుడు తిరుపతి ఆరోపణ 
నవతెలంగాణ – బెజ్జంకి 
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై మండల కాంగ్రెస్ శ్రేణులు చిన్న చూపెందుకని బీఆర్ఎస్ నాయకుడు కనగండ్ల తిరుపతి సోమవారం ఆరోపించారు. అంబేడ్కర్ జయంతి రోజున మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మార్నింగ్ వాక్ నిర్వహించి కూత వేటు దూరంలో ఉన్న గుగ్గీల్ల గ్రామ పంచాయతీ వద్ద  అంబేడ్కర్ విగ్రహనికి పూలమాల వేయకపోవడం సరైందికాదని, తిరుపతి అసహనం వ్యక్తం చేశారు. మండలంలో అత్యంత వైభవంగా నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో మండలంలోని కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు పాలుపంచుకోకపొవడం వివక్షకు సంకేతమని తిరుపతి వాపోయారు. మండలంలో  అభివృద్ది పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు.