బరాబర్‌ ప్రేమిస్తాడంట..!

equal To love..!చంద్రహాస్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘బరాబర్‌ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్‌ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్‌, ఏవిఆర్‌ మూవీ  వండర్స్‌ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవిఆర్‌ నిర్మిస్తున్నారు. మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా, అర్జున్‌ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్‌) ప్రతినాయకుడిగా  నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. హీరో  చంద్రహాస్‌ మాట్లాడుతూ, ‘నా రీసెంట్‌ మూవీ ‘రామ్‌ నగర్‌ బన్నీ’ ప్రేక్షకులకు బాగా రీచ్‌ అయ్యింది. నేను నా నెక్ట్స్‌ మూవీ ఎలా ఉండాలని అనుకున్నానో అలాంటి సినిమా ఇది. ఈ  సినిమాలో నేను హీరోగా నటించడానికి కారణం మా డీవోపీ శేఖర్‌. ఆయన నా ‘బ్లాక్‌ డాగ్‌ వైట్‌ చిక్‌’ సినిమా టీజర్‌ చూసి ఈ టీమ్‌కు పరిచయం చేశారు. అలాగే ఈ మూవీని  దర్శకుడు సంపత్‌ ఎంతో క్లారీటీతో, మంచి క్వాలిటీతో రూపొందించారు’ అని తెలిపారు. ‘నేను గతంలో ‘ఇష్టంగా, ఏక్‌’ అనే చిత్రాలు చేశాను. మంచి ప్రయత్నంగా ఆ సినిమాలకు  పేరు వచ్చింది. ఇదొక మంచి ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’ అని దర్శకుడు సంపత్‌ రుద్ర చెప్పారు. నిర్మాత చిన్ని గాయత్రి  మాట్లాడుతూ,’నేను పరుచూరి మురళి, జయంత్‌ దగ్గర డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. ఈ కథ వినగానే నచ్చి, నా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రొడ్యూస్‌ చేశాను. మంచి క్వాలిటీతో మూవీ చేశాం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.