నవతెలంగాణ- మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మంథని నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర పరిశ్రమల,ఐటి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా తెలంగాణ సచివాలయంలో గురువారం వేద పండితుల ఆశీర్వచనంతో భాద్యతలు స్వీకరించిన దుద్దిళ్ళ శ్రీధర్ బాబును శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.