
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోఆర్డినేటర్ కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా సౌత్ క్యాంపస్ లో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు క్యాంపస్ నుండి బిటిఎస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ అర్హత గల అధ్యాపకులను పీహెచ్డీ గైడ్ షిప్ ఇవ్వాలని, మహిళా అధ్యాపకులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల నిలబెట్టుకొని ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ ఎం యాలాద్రి, గర్ల్స్ హాస్టల్ వార్డెన్ సునీత, ఉమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సరిత, డాక్టర్ నరసయ్య, రమాదేవి, శ్రీకాంత్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.