
ప్రశ్నించడం అంటే మానవుడిగా ఉండడం, మానవుడిగా ఉండడమంటే ప్రశ్నించడం అని ఇంటర్ విద్యాధికారి అజ్మీర గోపాల్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్ లో వార్షికోత్సవ సమావేశాన్ని స్థానిక ప్రిన్సిపాల్ ఆసనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తృష్ణ జిజ్ఞాస అన్వేషణలతో జ్ఞానం ఏర్పడుతుందని అన్నారు.జ్ఞానం వలనే సంపద, సంపద వలన నాగరికత పురోగతి కలగుతుందని అన్నారు.జ్ఞాన నైపుణ్యాలను , వాటి ఫలాలు పొందే అవకాశాలను అంది పుచ్చుకోవాలని విద్యార్థులకి సూచించారు. అనంతరం ఆసనాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ దార్శనికత ,నిబద్ధత వలన కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే అడ్మిషన్ ల పెరుగుదల,మౌలిక సౌకర్యాల కల్పనలో అనూహ్యమైన అభివృద్ధి జరిగిందని అన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యా అవకాశకాలకు గైడన్స్ ను,ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను అభినందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన అట పాటల సాంస్కృతిక విభావరి ఉర్రుతలూగించింది. ఈ కార్యక్రమంలో యన్ యస్ యస్ అధికారి జ్యోతి ,అధ్యాపకులు కరుణాకర్,రాములు వెంకట్ గణేష్ గోపాలకృష్ణ అజమ్ మంజుల ప్రభాకర్ శ్రీకాంత్ ముత్తయ్య స్వర్ణలత లత లు పాల్గొన్నారు.