ఉత్తమ బిఎంసి గా రామునిపట్ల

నవతెలంగాణ – చిన్నకోడూరు
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ అవార్డు రామునిపట్ల గ్రామ బిఎంసి ఎంపికైనట్లు రామునిపట్ల గ్రామ సర్పంచ్ జేరిపోతుల శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంను ప్రతియేడు మే 22న జరుపుకుంటారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ చైర్మన్ రజత్ కుమార్ ఉత్తమ బిఎంసి అవార్డు రామునిపట్ల గ్రామ బిఎంసి అధ్యక్షుడు సర్పంచ్ శ్రీనివాస్ కి సోమవారం అందజేశారు.