ట్యాన్‌ తగ్గాలంటే…

To reduce tan...వాతావరణంలో మార్పులు, దుమ్మ, దూళి, నిత్యం ఎండలో తిరగాల్సి రావడం, రాత్రీ పగలూ తేడా తెలియకుండా లైట్ల కాంతిలో పనిచేయాల్సి రావడం వల్ల ముఖం నిర్జీవంగా మారుతుంది. ముఖం ట్యాన్‌ పట్టి.. కాంతివిహీనంగా మారుతుంది. దీనిని వదలించుకోవడానికి, ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి.. క్రీమ్‌లు వాడటం, ఫేషియల్స్‌ చేయించుకుంటూ ఉంటారు. కానీ, తేనెతో పాటు సహజ పదార్థాలతో ఈజీగా ట్యాన్‌, నలుపుదనం వదిలించుకోవచ్చు. అవేంటో చూద్దాం…
పెరుగుతో
– రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు, టేబుల్‌ స్పూను తేనె తీసుకుని బాగా కలపాలి.
– ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
– పదిహేను నిమిషాల తర్వాత కడగాలి.
పసుపుతో
– టీ స్పూను తేనెలో అర టీస్పూను పసుపు వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి
– ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి.
– పై రెండు ప్యాక్‌లను వారానికి మూడు సార్లు వేయడం వల్ల చర్మం మదువుగా మారడమేగాక, ఆరోగ్యంగా ఉంటుంది.
సహజసిద్ధ నిగారింపు
– రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి చక్కగా కలపాలి.
– ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
– పదిహేను నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి.
– బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
– ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన ట్యాన్‌ తగ్గుముఖం పడుతుంది.
– రోజ్‌ వాటర్‌ ముఖానికి సహజసిద్ధ నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది.