హెచ్‌సిఎల్‌టెక్‌ బాస్‌ రోష్నీకి

హెచ్‌సిఎల్‌టెక్‌ బాస్‌ రోష్నీకి– ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం
బెంగళూరు : ఐటి సేవల సంస్థ హెచ్‌సిఎల్‌టెక్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రాకు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. సోమవారం ”చెవలియర్‌ డి లా లెజియన్‌ ‘హాన్నూర్‌” (నైట్‌ ఆఫ్‌ ది లెజియన్‌ ఆఫ్‌ హానర్‌)ను ఆమెకు ప్రదానం చేశారు. ఈ అవార్డును ఢిల్లీలో ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడి తరపున భారత ఫ్రాన్స్‌ రాయబారి థియరీ మాథౌ అందజేశారు. ”ఈ గౌరవాన్ని అందుకోవడం నా అదృష్టం. ఇది భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని నొక్కి చెబుతుంది. హెచ్‌సిఎల్‌టెక్‌ ఫ్రాన్స్‌లో దీర్ఘకాల ఉనికిని కలిగి ఉంది. ఫ్రెంచ్‌ వ్యాపారాల డిజిటల్‌ పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము” అని రోష్ని నాడార్‌ పేర్కొన్నారు.