విశ్వక్ సేన్ నటిస్తున్న నూతన చిత్రం ‘మెకానిక్ రాకీ’. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఆదివారం ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ,’నవంబర్ 22 సినిమా రిలీజ్. రీసెంట్‌గా సినిమా చూశా. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నవంబర్ 21న పెయిడ్ ప్రీమియర్స్ వేస్తాం. సినిమా ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. రెండోసారి సినిమా చూసే రేంజ్‌లో ఉంది. ఇది ట్రైలర్ 1.0. రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ రిలీజ్ అవుతుంది’ అని తెలిపారు. ‘ట్రైలర్ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా కంటెంట్ ఉంది. ఒకొక్కటి అనౌన్స్ చేస్తూ ఉంటాం. అవన్నీ మీకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటాయని ఆశిస్తున్నాను’ అని డైరెక్టర్ రవితేజ చెప్పారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ, ‘సినిమా కూడా మాస్ కా దాస్ రేంజ్‌లో ఉటుంది. నవంబర్ 22 థియేటర్స్‌లో మాస్ జాతర ఖాయం. అందరూ థియేటర్స్‌కి వచ్చి చూసి ఎంజారు చేయండి’ అని అన్నారు.